Sunday, January 24, 2010

పాపం, గేదె కష్టాలు...


ఎఱ్ఱగడ్డ వంతెన దగ్గర కనిపించిందీ దృశ్యం మాకు ఇవాళ. పాపం ఆ గేదె ఎంత ఇబ్బంది పడుతూ అలా మెడ వేలాడేసుకుంటూ కూర్చుందో.....

ఇదివరకు ఒకట్రెండు సార్లు ఇలా గేదెని, దాని దూడని తీసుకెళ్లడం చూసాను. సాధారణంగా గేదెని నుంచోపెట్టి, అది కదలకుండా అన్ని వైపులా కట్టి, మెడకి ఇంకాస్త పకడ్బందీగా బంధం వేసి, బండికి కడతారు. పాపం ఈ గేదెకి కాళ్లు నెప్పట్టి కూర్చోవాలని ప్రయత్నించిందేమో. ఇలా మెడ వేళాడేసుకుంటూనే అది కూర్చుని ఎంత దూరం ప్రయాణం చేస్తొందో.....

ఫోటో క్రిడిట్స్ - మా ఆవిడ

1 comment:

శరత్ కాలమ్ said...

హ్మ్. మేమున్నటువంటి యు ఎస్ లాంటి పాశ్చాత్యదేశాలలో ఇలాంటివి కనపడితే పోలీసులకు వెంటనే సమాచారం అందిస్తారు. జంతు హింస కేసు పడుతుంది.