Saturday, October 28, 2006

లక్ష్మీ రావే మా ఇంటికి

ఈ దీపావళికి మా నాన్నగారి ప్రయత్నం వల్ల తామరపువ్వులు లభ్యమయ్యాయి. లక్ష్మీదేవిని తామరపువ్వులతో పూజించే భాగ్యం కలిగినందుకు అమ్మ ఎంతో ఆనందించింది.

మన వైదిక సనాతన వాఙ్ఞ్మయంలో "పద్మం" యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అమ్మవారిని కూడా పద్మ, పద్మిని, పద్మజ, పద్మాసని ఇలా చాలా విధాలుగా సంబోధిస్తారు. పైగా వర్ణనల్లో కూదా చాలా విరివిగా పద్మాన్ని వాడుతారు.

ముఖ్యంగా లక్ష్మీదేవి పద్మాసని కాబట్టి, పద్మముల మధ్య ఆసీనులైవున్న లక్ష్మీదేవిని మా అమ్మ ఊహించి, దానికి ఒక రూపం ఇస్తే నేను ఫొటో తీసాను.

లక్ష్మీదేవి పద్మిని పద్మజ Lakshmi Padmini Padmajaమా అమ్మ ఎక్కువగా పాడే లక్ష్మీదేవి మంగళం పాట ....

లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వర లక్ష్మీ రావే మా ఇంటికి

లక్ష్మీ రావే మా ఇంటికి
రాదితముగ నీ రాకచే
సూక్ష్మముగ మోక్ష మిచ్చు సుందరి
హరి మానస హారిణి
లక్ష్మీ రావే మా ఇంటికి

కుంకుమ పచ్చి కస్తూరి కోర్కెతో కోరు జవ్వారి
సతతము సాంబ్రాణి ధూపము
అంకితముగ అగరు గంధము
మాతా నీకు ప్రీతితో ప్రఖ్యతిగ సమర్పించునది
లక్ష్మీ రావే మా ఇంటికి

అందమైన జామపండు వివిధమైన నారింజలు
సతతము ఖర్జూర ఫలము సొంపైన దానిమ్మ ఫలము
మాతా నీకు ప్రీతితో ప్రఖ్యతిగ సమర్పించునది
లక్ష్మీ రావే మా ఇంటికి

Sunday, October 15, 2006

మంచినీళ్ళు - పంచుకోవడం

నేను మా ఊరుకి దగ్గరగానే ఉద్యోగం చేస్తుంటాను కాబట్టి తరచూ ఇంటికి వెళ్తుంటాను. ఇలా ఇంటికి రైలులో వెళ్ళేటప్పుదు సాధారణ (general)తరగతిలో ప్రయాణం. సొంత సంపాదన వచ్చాక రైలు ఎక్కిన ప్రతిసారీ ఒక మినరల్ వాటర్ బాటిల్, బిస్కట్లు కొనుక్కొని బండి ఎక్కడం పరిపాటి. బండి పైనుంచి వస్తుంది కాబట్టి ప్రయాణికులు బాగానే ఉంటారు. ఇక దారిలో ఆగిన ప్రతి స్టేషనులో ఇంకొంతమంది ఎక్కుతారు. వెరసి, సాధారణంగా రైలు ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక ప్రయాణంలో, నేను మంచినీళ్ళు తాగటం చూసి, "దాహమేస్తొంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వు బాబు" అని ఒక ముసలావిడ అడిగింది. మనసు వెంటనే మొహమాటపడింది. కొంచెం అయిష్టంగానే ఆ ముసలావిడకి బాటిలిచ్చాను. ఆవిడ తాగిన్నని తాగి, ఒళ్ళో ఉన్న మనడికి కొన్ని పోసి, కొన్నే నీళ్ళు మిగిలిన బాటిల్ నాకిచ్చింది. ఆవిడ తాగడమే కాకుండా, మనవడికి కూడా పట్టించి, కొన్ని నీళ్ళు మాత్రమే మిగిల్చి ఇవ్వడం నా మనసులో ఉన్న ఆ చెప్పలేని అసహన భావాన్ని ఇంకొంచం పెంచింది. సరె, కాసేపటికి ఏదో పుస్తకం చదవటంలో పడి గమ్యం చేరడం, తరువాత రోజు ఉద్యోగానికి వెళ్ళడం - షరా మామూలు జీవితం.

ఇవాళ ఇంటిలో plumber పని చేయడానికి ఇద్దరు వచ్చారు. పని చేస్తూ మధ్యలో ఒకతను "కొన్ని మంచి నీళ్ళు కావాలి" అని అడిగాడు. "తప్పకుండా" అని ఇద్దరికీ మంచినీళ్ళు తెద్దామని వంటింటికి వెళ్ళాను. చెంబు తీసాక, ఏంటో, "తప్పకుండా" అని అన్నప్పటి నాకు, చెంబునింపుతన్న నాకు, అర్థంకాని తేడా తోచింది. వాళ్ళకి రెండు గ్లాసులిచ్చి చెంబుతో నీళ్ళు పోసి "చాల"న్నాక మళ్ళి వంటింటికి వెళ్ళాను. అప్పుడు మెల్ల, మెల్లగా నా మనసులోని ఆ తేడాకి కారణం అర్థమయ్యింది. రెండు వారాల క్రితం వరకూ ఇంటిలో మామూలు మంచినీళ్ళు ఉండేవి. మొన్నీమధ్యనుంచే, మినెరల్ వాటర్ తెప్పిస్తున్నాము. డబ్బు పెట్టి కొన్న మంచినీళ్ళు అయ్యేసరికి, ఉత్తపుణ్యాన ఇవ్వడమంటె నా మనసుకి కష్టం తోచింది. అప్పుడు అర్థమయ్యింది ఆ రోజు రైలులో ముసలావిడకి మంచినీళ్ళు ఇవ్వడానికి నేను పడ్డ మొహమాటానికి అసలు కారణం.

ఆహా, ఎంత మార్పు. చిన్నప్పుడు రైలోలో ఢిల్లీ వెళ్తున్నప్పుడు, పక్క వాళ్ళు ఎవరు నీళ్ళు అడిగినా దాహం తీర్చడనికి ముందుండే మ పెద్దమ్మని చూసి, ఆ గుణం అలవర్చుకుని సంతృప్తి చెందే మనసుని, ఇంట్లో పనిచేసేవాళ్ళకి దాహమేస్తే, వారికి "చాలండి" అనే వరకు మంచినీళ్ళు పోసి ఆనందపడే మనసుని, "మంచినీళ్ళు కొనడం" అనే నిన్న మొన్నటి అలవాటు ఎంత మార్చేసింది? చేరకూడని చోట్లకి కూడా డబ్బు చేరి, "నేను డబ్బు మనిషిని కాదు" అని అనుకొనే నా మనసులోకి చేపకింద నీరులా చేరి ఇంతా మైకం కప్పుతుందని అనుకోలెదు !!!!

బ్రహ్మం గారి కాలఙ్ఞానంలో "పాలు, నీళ్ళు అమ్ముకుంటారు" అని చెప్పారని విన్నాను. చాల్లె చోద్యం, "పాలు" అమ్ముకోకుండా, free గా పంచుతారా ఏమిటి అనుకునేవాడిని. నేడు సాటి మనిషికి మంచినీళ్ళిచ్చి దాహం తీర్చడానికి కూడ ఈ అమ్ముకోవడం అడ్డుపడుతోందంటె, ఒకప్పుడు, పాలని కూడ అమ్ముకోకుండ ఉన్న స్థాయి ఎక్కడ, నేటి స్థాయి ఎక్కడ.

ఇంత ఆలోచించాక కూడా, నా తార్కిక మనసుకి ఒచ్చే వాదనలు ఇలా ఉన్నాయి.

"ఏం, ఏదో నేను చెడ్డవాడిని అయిపోయినట్లు విమర్శిస్తావేం? పాతిక రూపయలు పెట్టి, పెప్సి బాటిల్ కొన్నావనుకో, రైలులో పక్కవాడు "కాస్త తాగిస్తాను" అంటే, "తప్పకుండా. ఇదిగో తీసుకోండి" అని ఇస్తావా? ఇదీ అంతే కదా?"

నేను మాత్రం దానిని అంగీకరించలేకపోతున్నాను. అలాగని, మనుసుని తార్కికంగా ఖండించలేకపోతున్నాను......

Monday, October 02, 2006

Oct 2nd - Gandhi Jayanti - గాంధి జయంతి

A small reason for me to post 0n Mahatma Gandhi's birthday - it was a pleasant coincidence that I finished a re-read of "The Story of my experiments with truth" last week. My regard for the book and the person has only grown after the re-read.

Gandhiji was an avid reader and quite a number of books find mention in his life story.

- Bhagavad Gita , Mahabharata

Leo Tolstoy's
- The Gospels in Brief, What to do?
- The Kingdom of God is within you

John Ruskin's
- Unto this Last

Carlyle's
- Heroes and Hero-Worship

Sir Edwin Arnold's
- The Song Celestial (Gita translation)
- The Light of Asia (Gautam Buddha)

Washington Irving's
- Life of Mohamet and His successors

Let me see on how many of them I can lay my hands.


I came across a thought provoking perspective to one of Gandhiji's principles in an article I read in The Hindu, Sunday magazine.

" On the contrary, M.K. Gandhi's greatest legacy to India and the world was a form of political agitation called "civil disobedience", which frequently did lead to violence but which was so original a philosophy that it worked in certain circumstances and against certain regimes. One such authority was the British in India, a Government and a civilisation that believed in the rule of law, respected the judiciary and had a comparatively better record on human rights than other colonial power.

Had Nazi Germany been the colonial power in India, we would never have heard of Gandhi one mile into the `Dandi march'. Hypothetically speaking, what would have happened if six million Jews in Central Europe used `civil disobedience' to protest the death camps? Absolutely nothing. It was a military dictatorship. If Iraqis today used such a political philosophy to protest the occupation of their country by Bush, Cheney and Rumsfeld? Absolutely nothing. The truth is that for `civil disobedience' to work, you need both sides to play by the rules. The opposition you disobey has to be civilian, largely law abiding and at least partially democratic."


That for 'civil disobedience' to work, you need both sides to play by the rules. and also that the opposition you disobey has to be civilian, largely law abiding and at least partially democratic is a very stirring thought. That it had worked only because the opposition was British, doesn't go well with me. My heart doesn't accept it though the argument he advanced sounds logical to the mind. I need to dwell upon this more for clarity.