Saturday, December 30, 2006

నిన్న ఇవాళ - యాధృచ్చికం, కాకతాళీయం

నిన్న, ఇవాళ ఈ రెండు రోజులలో, సంబంధంలేనివే అయినా, ఎంతో యాధృచ్చికంగాను కాకతాళీయంగాను కొన్ని కొత్త వస్తువులు నా దగ్గరికి చేరాయి.

ఎప్పుడూలేనిది, నిన్న కొంచెం పొద్దున్న నిద్రలేచాను. ఎనిమిదింటికి DELL అతను ఒకతను ఫోను చేసి "మీ replacement battery వచ్చింది, ఇవాళ మీ office లో అందజేస్తాము" అని అన్నాడు. DELL లో వాడబడే SONY batterys కొన్ని అరుదైన సందర్భాలలో నిప్పు వచ్చి మండవచ్చు. కాబట్టి అటువంటి batterys కి ప్రత్యామ్నాయ battery ని అందజేస్తాని DELL ప్రకటించింది. నేను వారి site లో నా battery model సరిచూసుకుని, ప్రత్యామ్నాయ battery కి దరఖాస్తు పెట్టాను.ఆయితే, నేను laptop కొన్నది అమెరికాలో. ఇప్పుడుంటున్నది భారతదేశంలో. కొత్త battery ని ఇంతదూరం పంపుతారో లేదో అన్న అనుమానంతోనే ఇక్కడి చిరునామా ఇచ్చాను. ఇది జరిగి నాలుగునెలలు గడిచాయి. నేను ఈ మాట కూడా మరిచాను. ఇక పంపరేమో అనుకున్నాను. ఇవాళ ఉన్నట్టుండి ఫోను వచ్చింది, అదీ తెల్లారగట్ట ఎనిమిది గంటలకు !!!!! ఫోనులో చెప్పినట్టుగానే కొత్త battery నాకందింది.

ఉద్యోగానికి బయల్దేరేముందు, అన్నయ్య బెంగుళూరు నుంచి వచ్చాడు. "నీకు, నాన్నగారికి రెండు T shirts తెచ్చాను. నీకేది కావాలో చూసుకో, ఇంకోటి నాన్నగారికిస్తాను" అన్నాడు. అనుకోకుండా ఇంకో కొత్త వస్తువు.

సరే, ఉద్యోగానికి వెళ్లాను. అక్కడ, ఎప్పుడూ లేనికి ఈ సంవత్సరం మా office లో ఉద్యోగస్తులందరికీ Yearly Planner, Calendar ఇస్తున్నాము అని టపా ఒచ్చింది. మా సహోద్యోగులతో వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకో కొత్త వస్తువు.

సాయంత్రం ఉద్యోగం అయ్యాక, అమెరికా నుంచి వచ్చిన మా స్కూలు స్నేహితుడిని కలవడానికి వెళ్లాను. అతను నాకు మంచి స్నేహితుడు. flickr లో నా ఫోటోలు చూసి, అందులో నేను వేరే స్నేహితుడి tripod వాడుతున్నాను అని రాసింది చూసి, తను భారతదేశం వచ్చేటపుడు ఒక Tripod తెస్తానన్నాడు. నిన్న నాకు అమెరికా నుంచి తెచ్చిన Tripod ఇచ్చాడు........ ఈ మధ్య నాకు పట్టిన photography వ్యసనానికి ఇదింకొంచం ప్రోద్బలం :-)

ఇక ఇవాళ, నా కాలేజి స్నేహితుడు ద్వారా నాకు ఇంకో వస్తువు చేరింది. నా flickr లోని photos కొన్నిటితో 2007 Table Top Calendar ఒకటి చేయించి నాకు ఇచ్చాడు !!!!!!! నాకు చాలా ముచ్చటేసింది. అసలు నాకు flickr పరిచయమయిందే ఇతని ద్వారా. ఇతని ద్వారానే నేను flickr, photography కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటాను. ఇది www.picsquare ద్వారా సాధ్యమయ్యింది.


రెండు రోజులలో ఇన్ని కొత్త వస్తువులు నాకు చేరడం పూర్తిగా కాకతాళీయమే అయినా, ఇలాంటివి ఎప్పుడో గాని జరగవేమో అని అనిపించింది.

Tuesday, December 19, 2006

అరిటాకులో అమ్మచేతి కమ్మని భోజనం

అవకాశం దొరికనప్పుడల్లా, కారణం కనిపించినప్పుడల్లా ఇంటికి వెళ్లడం ఒక అలవాటయిపోయింది. గడిచిన వారాంతం కూడా ఇంటికి వెళ్లాను.

ఈసారి కారణాలలో ఒకటి, అమ్మ పది మందిని భోజనానికి పిలిచింది...... నేను వుంటే సహాయంగా వుంటానని. ఆమ్మ మనసులో అంతే వుంటే అది అమ్మ మనసు ఎందుకవుతుంది. చేసే రుచికరమైన పదార్థాలు దగ్గరలో ఉన్న కుర్రాడు తిని ఆనందిస్తాడు కదా అన్నది బయటికి చెప్పనవసరంలేని అమ్మ మనసులోని మాట. ఎందుకంటే, నేను అన్నయ్య ఇంట్లో లేనప్పుడు, మాకు ఇష్టమయినవి, లేక ప్రత్యేకమైన వంటకాలు వండినప్పుడు అయ్యో నువ్వు లేవురా అని తరువాత ఫోన్లో అనడం మామూలే.

ఈసారి భోజనానికి వచ్చిన అథితులు పధ్నాలుగు మంది కాక అమ్మ, నాన్నగారు, నేను. వెరసి పదిహేడు మంది.

అరిటాకులో భోజనాలు.
దోసకాయ పప్పు
ఆవ పెట్టిన అరిటికాయ కూర
కొత్తిమీర కారంతో వంకాయ కూర
దోసావకాయ
పులిహోర
ముక్కల పులుసు
పెరుగు
పాయసం
రవ్వకేసరి
ముందురోజే కాచిన నెయ్యి


అమ్మ నేను అందరికీ వడ్డించాము. తరువాత అమ్మ ఆడవారికి పళ్ళు, తాంబూలాలు ఇచ్చాక, ఇద్దరం కలిసి భోజనం చేసాము.

పదిహేడు మందికి ఒక్క చేత్తో, వేరే వాళ్ల సహాయం లేకుండా వండేసింది అమ్మ. వడ్డనలో మాత్రమే నేను సహాయం చేసాను.

అసలు అరిటాకులో భోజనం అంటేనే అదో తెలియని రుచి కలుగుతుంది నాకు. ఇక కింద కూర్చుని, పదిమందికి వడ్డించి తరువాత తినడం.... అన్నింటికీ మించి అమ్మచేతి వంట. ఇక చెప్పక్కర్లేదు.

Restaurants కి వెళ్ళి order చేసి తినడం, functions కి వెళ్ళి (అవి అచ్చమైన ఆంధ్రా వయినా) నుంచుని buffet లు తినడం మధ్య అప్పుడప్పుడు ఇలాంటి భోజనాలు జిహ్వకి, కడుపుకి, మనసుకీ కూడా సంతృప్తినిస్తాయి.