సు: ఎవరితోటోయ్ మాట్లాడుతున్నావు ఫోనులో? అత్తయ్యగారితో నేనా? పైగా “ఈ మధ్య అస్సలు మాట వినట్లేదు” అనికూడా అంటున్నావు, నా గురించేనా?
సుం: విన్నారూ.... అవును మా అమ్మతోనే....... మీ గురించే మాట్లాడుతున్నాను, ఇంకెవరిగురించి మాట్లాడతాను... ఏ మాట్లాడకూడదా...
నేనలా అన్నానా? సరేలే.... ఏంటి ఇడ్లీ పిండి రుబ్బుతున్నావా? అన్నట్టు నిన్న మిక్సీ పాడయ్యింది కదా? నేను కూడా ఓ చెయ్యేసాను, అయినా అది బాగవ్వలేదు...... ఎంచేసావేమిటి?
ఆ, నేనేం చేస్తానూ... కాస్త పాతబడింది కదా, కొంచెం మొరాయిస్తోందని, గట్టిగా ఓ దెబ్బ వేసాను, మాట వినడం మొదలెట్టింది. ఇప్పుడు సరిగ్గా పనిచేస్తోంది.
1 comment:
ధాంక్స్ అండి....
మొగుదు కుడా పాతబడితే ఒక దెబ్బ వేయచ్చని చెప్పినందుకు :-)
Post a Comment