Monday, September 04, 2006

శ్రీశ్రీ - సిప్రాలి - శ్రీరంగ నీతులు

పాతబడి కుళ్లిపోయిన
నీతులనే పట్టుకుని మనీషుల మంటూ
నూతన జీవిత లహరికి
సేతువు నిర్మింతురేల? సిరిసిరిమువ్వా!

వ్యాపార ప్రకటనలే
వ్యాపించుట చేత నేటి పత్రికలందున్
రాపిడిపడి సత్యం కా
శీ పయనం కట్టెనయ్యొ సిరిసిరిమువ్వా!

నేటికి అన్వయించుకోవాలంటే, పత్రికల స్థానంలో TV channels ని చేరిస్తే సరి !!!!!


అంతా సురా ఘటేశులె,
అంతింతో ఆచమాన మడిగేవారే,
పంతానికి మాత్రం శివ
చింతా దీక్షితుల మండ్రు, సిరిసిమువ్వా!


ఇది నేను ఒప్పుకోను। శ్రీశ్రీ చుసిన పరిసరాలలో, పరిస్థుతలలో, ప్రజలలో ఇది నిజమేమో। ఇప్పటికి కూడా సురాపానానికి దూరంగా ఉండేవారు చాలా మంది ఉన్నారు।

మీసాలకు రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే!
సీసా లేబిల్ మార్చే
స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరిమువ్వా!

ఇది చాలా బావుంది :-) ఇక్కడ కూడా సారా సాగా (saga) సాగింది। శ్రీశ్రీ కాస్త ఎక్కువ సేవించేవారేమో!!!

No comments: