Sunday, May 01, 2005

ఒక కవిత

ఈ చిత్రాన్ని చూసినప్పుడు కలిగిన భావాలు॥॥।



ఉదయిస్తున్న సూర్యుడికై ఉత్సాహమా
అస్తమిస్తున్న అర్కునికై ఆవేదనమా!!

సౌందర్యరాశి నుదుటి సౌభాగ్య సింధూరమా
కర్కశుని కరవాల కౄర కార్యమా!!

ప్రశాంతత నిండిన సువిశాల సౌమ్య సంద్రమా
దాగిన సుడిగుండాలతో భీతి గొల్పు జలాశయమా!!

మనసుని మురిపించు మలయ-మారుతమా
జగముని జడిపించు ఝంఝా-మారుతమా!!

మంచి చెడుల భావనలతో ఊగిసలాటయే జీవనమా
మంచి చెడుల కతీతమైన దానికై ఆరాటపడవే ఓ మనమా!!

2 comments:

idlekrish said...

As a native of Visakhapatnam, I saw many beautiful sunsets. Even though, if I had the talent to write something like that, probably I cannot come with such a wondeful piece of writing.

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

Krishna, yes I concur with you that Vizag indeed has some really great sunsets and natural scapes.

మీది, యిసాకపట్నమేటి... నాది యిసాకపట్నం కాక పోయినా, చిన్న.. కాదు కాదు పెద్ద పరిచయమే ఉన్నాది..। మరి ఏడేళ్లు సైనిక స్కూలు, కోరుకొండలో సదివినాను కాదేటి...

Long time since I visited the beautiful place though. I have been wanting to experience it all over again.....