విశ్వనాథ సత్యనారయణ గారు రచించిన "విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు" పుస్తకం లో వాడబడిన సామెతలు ఇవి।
----------------------------------------------------------------------------
కొబ్బరి చెట్టెందు కెక్కావురా అంటే దూడ గడ్డికోసం అన్నట్టు
కాలికి వేస్తే మెడకు - మెడకు వెస్తే కాలికి
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
కొండనాలుకకు మందు వేయబోతే ఉన్న నాలుక ఊడిపోయినట్లు
గోరు చుట్టుపై రోకటిపోటు
అతడి కంటే ఘనుడు ఆచంట మల్లయ్య
గుడ్డిలో మెల్ల
పాల ముంచినా నీట ముంచినా నీదే భారం
కంపనపడ్ద కాకివలె
బెల్లము కొట్టిన రాయల్లే
బొడ్డూడని కవులు , కాలి గిట్టలు గిల్లని కవులు
అంత్య నిష్ఠూరం కంటె ఆది నిష్ఠూరం మంచిదన్నారు
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు జడవవు
తెలివి తెల్లారినట్లే ఉంది
కొరివి పెట్టి తల గోకికోవడమే
ఆదిలోనే హంసపాదన్నట్లు
మాతలు నేర్చిన కుక్కని వేటకు తీసుకవెళితే - ఉస్కో అంటే ఉస్కో అంటుంది
రొట్టె విరిగి నేతిలో పడినట్లు
ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదేస్తే గోహత్య
బాబుకు పెళ్లయిందని సంతోషించాదు। కని మేకై కూర్చుండే సవితమ్మ వస్తుందని తెలియదట।
స్వర్గానికి వెళ్లినా వడియేకులు తప్పలేదని
పచ్చి వెలగకాయ నోట్లో పడ్డట్లు
గుడ్డెద్దు చేలో పడ్డట్టు
ఉన్నదుండగా ఉయ్యూరుమీద మేడూరు పడ్డదని
చావు తప్పి కన్నులొట్టబోయెను అన్నట్లు
బతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు
--------------------------------------------------------------------------------
తెలుగు పుస్తకాలు చదివే అభిరుచి ఉన్నవారు, తెలుగు భాష గురించి ఆసక్తి ఉన్నవారు ఈ పుస్తకాన్ని ఆనందిస్తారని నా అభిప్రాయం। పుస్తకంలో తొంభై ఎనిమిది పేజీలు మాత్రమే ఉన్నాయి। వెల కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే।