Tuesday, December 19, 2006

అరిటాకులో అమ్మచేతి కమ్మని భోజనం

అవకాశం దొరికనప్పుడల్లా, కారణం కనిపించినప్పుడల్లా ఇంటికి వెళ్లడం ఒక అలవాటయిపోయింది. గడిచిన వారాంతం కూడా ఇంటికి వెళ్లాను.

ఈసారి కారణాలలో ఒకటి, అమ్మ పది మందిని భోజనానికి పిలిచింది...... నేను వుంటే సహాయంగా వుంటానని. ఆమ్మ మనసులో అంతే వుంటే అది అమ్మ మనసు ఎందుకవుతుంది. చేసే రుచికరమైన పదార్థాలు దగ్గరలో ఉన్న కుర్రాడు తిని ఆనందిస్తాడు కదా అన్నది బయటికి చెప్పనవసరంలేని అమ్మ మనసులోని మాట. ఎందుకంటే, నేను అన్నయ్య ఇంట్లో లేనప్పుడు, మాకు ఇష్టమయినవి, లేక ప్రత్యేకమైన వంటకాలు వండినప్పుడు అయ్యో నువ్వు లేవురా అని తరువాత ఫోన్లో అనడం మామూలే.

ఈసారి భోజనానికి వచ్చిన అథితులు పధ్నాలుగు మంది కాక అమ్మ, నాన్నగారు, నేను. వెరసి పదిహేడు మంది.

అరిటాకులో భోజనాలు.
దోసకాయ పప్పు
ఆవ పెట్టిన అరిటికాయ కూర
కొత్తిమీర కారంతో వంకాయ కూర
దోసావకాయ
పులిహోర
ముక్కల పులుసు
పెరుగు
పాయసం
రవ్వకేసరి
ముందురోజే కాచిన నెయ్యి


అమ్మ నేను అందరికీ వడ్డించాము. తరువాత అమ్మ ఆడవారికి పళ్ళు, తాంబూలాలు ఇచ్చాక, ఇద్దరం కలిసి భోజనం చేసాము.

పదిహేడు మందికి ఒక్క చేత్తో, వేరే వాళ్ల సహాయం లేకుండా వండేసింది అమ్మ. వడ్డనలో మాత్రమే నేను సహాయం చేసాను.

అసలు అరిటాకులో భోజనం అంటేనే అదో తెలియని రుచి కలుగుతుంది నాకు. ఇక కింద కూర్చుని, పదిమందికి వడ్డించి తరువాత తినడం.... అన్నింటికీ మించి అమ్మచేతి వంట. ఇక చెప్పక్కర్లేదు.

Restaurants కి వెళ్ళి order చేసి తినడం, functions కి వెళ్ళి (అవి అచ్చమైన ఆంధ్రా వయినా) నుంచుని buffet లు తినడం మధ్య అప్పుడప్పుడు ఇలాంటి భోజనాలు జిహ్వకి, కడుపుకి, మనసుకీ కూడా సంతృప్తినిస్తాయి.

12 comments:

రాధిక said...

intloa emayina viseshamaa?ayinaa aakuloa bhojanam amrutam toa samaanam.mii ii post kuudaa aritaaku bhojanam laa amdam gaa vundi.

Raghu said...

అమ్మ ని గుర్తు చేసారు !!

ఇక్కడ పిజ్జాలు, బర్గర్లు తప్ప ఏమీ లేవు...
మళ్ళీ అంత కమ్మని భోజనం ఎప్పుడు తింటానో...

ప్రస్తుతానికి మీ పోస్టు చూసి కడుపు నింపుకున్నా !!

కొత్త పాళీ said...

కొత్తిమీర కారంతో వంకాయ కూర .. యం యం .. మీరు ద్రావిడులా? :-)

చేతన_Chetana said...

ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి అని పాడాలని ఉంది వంటకాల లిస్టు చూడగానే. కాకతాళీయం ఏమిటంటే, నిన్న ఆవపెట్టిన అరటికాయ కూర చేద్దామనుకుని ఎందుకో అది మానేసి కొత్తిమీర కారంతో పెద్ద పచ్చిమిరపకాయల కూర (సమయానికి ఇంట్లో వంకాయలు లేక) చేసాను. కాని వంటకాలు లిస్టు చూస్తుంటే వాటిని పచ్చటి అరిటాకులో దృశ్యం ఊహించుకుంటుంటే, ఆహా, కళ్ళకీ (కేమరాతో పాటూ), నోటికీ కూడా విందే.. అనిపిస్తుంది. దొరల పద్ధతి అని ఆకలెయ్యటానికి, తినే ముందు సూపులు తాగుతారేమో(?) కానీ అరటాకులో భోజనం వడ్డిస్తే రెండ్రోజులకి సరిపోయే ఆకలేయనది ఎవరికి?

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

@radhika: మా అమ్మ ఏదో పారాయణ చేసారు. అది పూర్తైన సందర్భంగా పది మందికి భోజనం పెడితే మంచిదిట. అందుకని మా అమ్మ ఇది సంకల్పించారు.

@rahu ram: మీ comment చూసి నాకు కూడా కడుపు నిండినంత సంతృప్తి కలిగింది

@కొత్త పాళీ: లేదండి, మేము దావిళ్ళం కాము. కాని మాది కూడా గోదావరి జిల్లాయే. సరిగ్గా చెప్పాలంటే, మాది ప.గో. జిల్లా అండి. ఆయ్...

@చేతన: నిజమే నండి, అరిటాకులో వడ్డించిన భోజనం కళ్ళకి కూడా విందే. పైగా మా అమ్మ వడ్డనలో ఏది ముందు, ఏది తరువాత, ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి అని కూడా చెప్పి ఓ పద్ధతిలో వడ్డన చేయించారు.
అక్కడెక్కడో అమెరికాలో ఉండి కూడా మీరు ఆవపెట్టి కూర వండాలనుకోవడం, కొత్తిమీర కారం పెట్టి పచ్చిమిరపకాయలతో వండడం గురించి చదివి ముచ్చటేసింది. అవకాశం ఉంటే, రుచికూడా చూడాలని ఉంది :-) మీ కూరా బాగానే కుదిరిందని, అదిరిందని తలుస్తాను.

కొత్త పాళీ said...

Harsha, check this out!
http://www.photojojo.com/content/tutorials/project-365-take-a-photo-a-day/

saigeetika said...

Nice article. Delicious to read :)

Sravan Kumar DVN said...

harsha, oka photo pettachchu kadaa

Sujata M said...

i felt so good after reading ur write-up. thanq.

Anonymous said...

amma cheti vanta...arati aaku...chala bagundi...cheppalenanta......chustune akali teeripoyindi....

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది.

హర్షోల్లాసం said...

గౌరవనీయులైన హర్ష గారికి
మీరు రాసిన ఈ టపా చాలా బాగుంది.మా అత్తగారు బాగా వంట చేస్తారని చాలా చక్కగా రాశారు.
ధన్యవాదాలు.:)