Saturday, December 30, 2006

నిన్న ఇవాళ - యాధృచ్చికం, కాకతాళీయం

నిన్న, ఇవాళ ఈ రెండు రోజులలో, సంబంధంలేనివే అయినా, ఎంతో యాధృచ్చికంగాను కాకతాళీయంగాను కొన్ని కొత్త వస్తువులు నా దగ్గరికి చేరాయి.

ఎప్పుడూలేనిది, నిన్న కొంచెం పొద్దున్న నిద్రలేచాను. ఎనిమిదింటికి DELL అతను ఒకతను ఫోను చేసి "మీ replacement battery వచ్చింది, ఇవాళ మీ office లో అందజేస్తాము" అని అన్నాడు. DELL లో వాడబడే SONY batterys కొన్ని అరుదైన సందర్భాలలో నిప్పు వచ్చి మండవచ్చు. కాబట్టి అటువంటి batterys కి ప్రత్యామ్నాయ battery ని అందజేస్తాని DELL ప్రకటించింది. నేను వారి site లో నా battery model సరిచూసుకుని, ప్రత్యామ్నాయ battery కి దరఖాస్తు పెట్టాను.ఆయితే, నేను laptop కొన్నది అమెరికాలో. ఇప్పుడుంటున్నది భారతదేశంలో. కొత్త battery ని ఇంతదూరం పంపుతారో లేదో అన్న అనుమానంతోనే ఇక్కడి చిరునామా ఇచ్చాను. ఇది జరిగి నాలుగునెలలు గడిచాయి. నేను ఈ మాట కూడా మరిచాను. ఇక పంపరేమో అనుకున్నాను. ఇవాళ ఉన్నట్టుండి ఫోను వచ్చింది, అదీ తెల్లారగట్ట ఎనిమిది గంటలకు !!!!! ఫోనులో చెప్పినట్టుగానే కొత్త battery నాకందింది.

ఉద్యోగానికి బయల్దేరేముందు, అన్నయ్య బెంగుళూరు నుంచి వచ్చాడు. "నీకు, నాన్నగారికి రెండు T shirts తెచ్చాను. నీకేది కావాలో చూసుకో, ఇంకోటి నాన్నగారికిస్తాను" అన్నాడు. అనుకోకుండా ఇంకో కొత్త వస్తువు.

సరే, ఉద్యోగానికి వెళ్లాను. అక్కడ, ఎప్పుడూ లేనికి ఈ సంవత్సరం మా office లో ఉద్యోగస్తులందరికీ Yearly Planner, Calendar ఇస్తున్నాము అని టపా ఒచ్చింది. మా సహోద్యోగులతో వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకో కొత్త వస్తువు.

సాయంత్రం ఉద్యోగం అయ్యాక, అమెరికా నుంచి వచ్చిన మా స్కూలు స్నేహితుడిని కలవడానికి వెళ్లాను. అతను నాకు మంచి స్నేహితుడు. flickr లో నా ఫోటోలు చూసి, అందులో నేను వేరే స్నేహితుడి tripod వాడుతున్నాను అని రాసింది చూసి, తను భారతదేశం వచ్చేటపుడు ఒక Tripod తెస్తానన్నాడు. నిన్న నాకు అమెరికా నుంచి తెచ్చిన Tripod ఇచ్చాడు........ ఈ మధ్య నాకు పట్టిన photography వ్యసనానికి ఇదింకొంచం ప్రోద్బలం :-)

ఇక ఇవాళ, నా కాలేజి స్నేహితుడు ద్వారా నాకు ఇంకో వస్తువు చేరింది. నా flickr లోని photos కొన్నిటితో 2007 Table Top Calendar ఒకటి చేయించి నాకు ఇచ్చాడు !!!!!!! నాకు చాలా ముచ్చటేసింది. అసలు నాకు flickr పరిచయమయిందే ఇతని ద్వారా. ఇతని ద్వారానే నేను flickr, photography కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటాను. ఇది www.picsquare ద్వారా సాధ్యమయ్యింది.


రెండు రోజులలో ఇన్ని కొత్త వస్తువులు నాకు చేరడం పూర్తిగా కాకతాళీయమే అయినా, ఇలాంటివి ఎప్పుడో గాని జరగవేమో అని అనిపించింది.

8 comments:

cbrao said...

'The child is the father of a man.' అని ఓ ఆంగ్ల కవి రాసినట్లు అమెరికా నుంచి ఎదైన కానుక అందినప్పుడు చిన్న పిల్లవాడిలా సంబరపడతాను. మీకు అందిన ఈ కొత్త వస్తువులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తాను.

Sriram said...

nutana samvatsara subhakankshalu...

రానారె said...

Google picasa choosaaraa? Adi ficker kante baagundani vinnaanu?

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

@cbrao గారు: మంచి వాక్యం రాసారు. మిగతా వస్తువులు పెద్దగా కాకపోయినా, photography కి సంబంధించిన వస్తువులు ఆనందంనాన్ని కలిగించాయి.

@sriram: మీకు కూడా నూతన సంవత్సర సుభాకాంక్షలు.

@రానారె: నేను picassa లో కూడా కొన్ని ఫోటోలు పెట్టానండి. filckr లో సభ్యులు, వారి comments, ముఖ్యంగా groups ఫోటోగ్రఫీ మీద మక్కువ ఉండే వారికి చాలా ఉపయోగంగా ఉంటాయి.

saigeetika said...

Yeah. Truly coincidental. So many gifts on one day. Great. Wishing you a very Happy and Prosperous New Year.

ravi shankar said...

R u from sainik school?? sorry if i guessed wrongly....

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

@ravi shankar: Yes, you guessed it right. I am a Saikorian.

హర్షోల్లాసం said...

we r waiting for a new post.please make it as soon as possible