"ధన మూలం మిదం జగత్" అని అందరూ అంటూ వుంటారు। అది వాల్మీకి రామాయణం లో శ్రీరామునితో లక్ష్మణుడు అనిన మాట।
ధనమార్జయ కాకుత్థ్స - ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ!!
ఓ కాకుత్థ్స వంశ తిలకా! రామా! ఈ లోకానికి ధనమే ప్రధానం కాబట్టి ధనాన్ని బాగా సంపాదించు! డబ్బులేని వాడు చచ్చిన వానితో సమానం। వీరిద్దరికీ తేడా లేదని శ్లోక భావం। లక్ష్మణుడీ మాటను లంకలో రావణ మరణానంతరం అన్నాడు। దానికి శ్రీరాముడు చాలా గంభీరంగా యుగయుగాలకు సరిపడా -
అపి స్వర్ణమయీ లంకా - న మే రోచతి లక్ష్మణ
జననీ జన్మభూమిశ్చ - స్వర్గాదపి గరీయసి!!
అని సమాధానం చెప్పాడు। ఆ ప్రబోధం మానవ శిరోరత్నం కదా! 'లక్ష్మణా! లంక బంగారమే కావచ్చు కానీ నాకు యిష్టం లేదు। జనని, జన్మభూమి స్వర్గం కంటె గొప్పవి సుమా!' అని యీ శ్లోక భావం।
పై మూల శ్లోకాలు, వాటి భావాలు నేను 'నవ్వుటద్దాలు' అనే పుస్తకంలో మూలాలు - మూల్యాలు అనే విషయంలో చదివాను। ఈ పుస్తకాన్ని ఆచార్య తిరుమల గారు రచించారు। కొన్ని చమత్కార , హాస్యరస పద్యాలను, చాటువులను ఈ పుస్తకంలో వివరించారు। ఈ 'మూలాలు - మూల్యాలు' విషయంలో మాత్రం, మనం తరచూ వినే వాటికి అసలయిన అమూల్యమైన మూలాలను మనకు అందించారు।
5 comments:
హర్షా,
ఆ పుస్తకంలో ఈ పద్యాల citations ఉన్నాయా? ఏ సర్గ, ఎన్నో శ్లోకం - ఇలాంటివి. ఎందుకంటే, ధనమూలం శ్లోకం విశ్వామిత్రుడు రాముడితో అన్నది అని ఎప్పుడో చదివినట్లు గుర్తు. జన్మభూమి అనే concept రామాయణం కాలంలో అసలు లేదు అని కూడా ఒక argument ఉంది. ఆ పద్యాల details ఉంటే మనం valmikiramayan.net/sacred-texts.com లో check చేసుకోవచ్చు,
విజయ్
Interesting, both the post and the comment..!! Thanks
లేదు విజయ్, ఆ పుస్తకంలో ఏ సర్గ, ఎన్నో శ్లోకం అని రాయలేదు। నేను ఇక్కడ దొరికే వాల్మీకి రామాయణం పుస్తకాలలో ఒకసారి చూస్తాను। valmikiramayan.net లో ఇంకా యుద్ధకాండ పూర్తిగా పెట్టలేదు। 'ధన మూల మిదం జగత్' అయితే నేను ఈ పుస్తకంలో మొదటిసారి చూసాను. కానీ ' జననీ జన్మభూమిశ్చ - స్వర్గాదపి గరీయసి' రాముడు చెప్పినది అని ఎక్కడో చదిన / విన్న జ్ఞాపకం।
(Removed some names)
హర్షా,
నేను Indo-Eurasian Research yahoo group లో ఈ question అడిగాను. ఒక professor చెప్పినదాని ప్రకారం ఈ శ్లోకాలు ఆయన దగ్గర ఉన్న critical edition లో లేవు.
Quoting: "They are from a modern source and are not in any old version of the text."
ధనమూలం శ్లోకం విశ్వామిత్రుడు చెప్పాడు అన్న విషయం కూడా బూదరాజు రాధాకృష్ణ గారి 'విన్నంత కన్నంత' లో చదివినట్లు గుర్తు. చూసి చెప్తాను,
విజయ
Post a Comment