జాషువ జయంతి - Sep 29th
రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమేగె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాల్కల యందు
ఈtv - 2 లొ ఆదివారం నాడు ప్రసారమయ్యే, "తెలుగు వెలుగు" కార్యక్రమంలో, క్రితం వారం జాషువ గురించి ప్రత్యేక ప్రస్తావన చేసారు। అప్పుడు తెలిసింది, Sept 29 ఆయన జయంతి అని।
నాకు నచ్చిన తెలుగు కవులలో జాషువ ఒకరు। ఈ బ్లాగుని ఆయన గబ్బిలం మీద ఒక విమర్శకుడు రాసిన వ్యాసంతో మొదలుపెట్టాను।
నేను చిన్నప్పుడు తెలుగు వాచకములోని పద్యభాగంలో పై పద్యం చదువుకున్నాను। పాఠం పేరు "రాజు కవి" అనుకుంటా। సరిగ్గా జ్ఞాపకంలేదు। ఈ పాఠం ఏడవ తరగతి లోనిదో లేక ఎనినిమిదవ తరగతి లోనిదో అనుకుంటా। అది కూడా సరిగ్గా జ్ఞాపకంలేదు। కాని, ఆ పాఠం, అందులోని ఈ పద్యం, ముఖ్యంగా పద్య భావం నాలో బాగా నాటుకున్నాయి।
గబ్బిలం నుండి రెందు పద్యాలు
ఒక అస్పృశ్యుడు తన గోడు పరమేశ్వరుడితో విన్నవించమని ఒక గబ్బిలాన్ని దూతగా పంపుతున్నాడు।
ఆలయంబున నీవు వ్రేలాడు వేళ
శివుని చెవినీకు, గొంత చేరువుగనుండు
మౌని కగరాజ్ఞి! పూజారి లేని వేళ
విన్నవింపుము నాదు జీవితచరిత్ర
ధర్మమునకు బిఱికి తన మెన్నఁడును లేదు
సత్య వాక్యమునకుఁ జావు లేదు
వెఱవనేల నీకు విశ్వనాథుని మ్రోల
సృష్టికర్త తాను సృష్టి వీవు
No comments:
Post a Comment